Header Banner

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్!

  Tue Jun 10, 2025 15:39        Politics

అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానెల్‌ డిబేట్ లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న కమిషన్, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఒక లేఖ రాశారు. అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.

 

ఇది కూడా చదవండి: రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తుచేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియా మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలను ఆధారంగా చేసుకుని, ఎన్‌సీడబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ తన లేఖలో ఆదేశించారు. కృష్ణంరాజు అమరావతిని 'వేశ్యల రాజధాని' అని వ్యాఖ్యానించడం తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. దీనికి సంబంధించిన కేసులో సాక్షి టీవీ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం తెలిసిందే.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #amaravati #WomensCommission #krishnamRaju #Remarks #Appolitics #APNews #ViralNews